తెలంగాణ రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా  కాయగూర పంటలు సాగు చేపట్టవచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చెప్తున్న డిమాండ్ ఉన్న పంటలలో ముందుగా నిలిచేవి  కాయగూరలు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 100 గ్రాముల పండ్లు, 300 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. అందులో  50 గ్రాములు ఆకుకూరలు, 50 గ్రాములు దుంప కూరలు, మిగతావి 200  గ్రాములు ఇతర కాయగూరలు ఉండాలి. అయితే ప్రస్తుతం తెలంగాణలో 300 గ్రాముల కాయగూరలకు గాను సరాసరిన 225 గ్రాములు మాత్రమే వినియోగిస్తున్నారు. అంటే మరో  75 గ్రాములు తక్కువగా తింటున్నారు. గణాంకాల  ప్రకారం హైదరాబాద్ నగర వినియోగదారులకి  రోజుకి సరాసరిన 7500 వేల కిలోల కూరగాయలు  అవసరం. దీనితో పాటు కోవిడ్ నేపథ్యంలో వినియోగదారులు ఎక్కువ మొత్తంలో కాయగూరలు వినియోగిస్తున్నారు. కోవిడ్ వల్ల  నగరవాసులు ఎనిమిది కిలోల కు బదులుగా 12 కిలోల కిలోలు నెలకు వినియోగిస్తున్నారు. అయితే నగర కూరగాయల అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా రాష్ట్రంలో కూరగాయలు ఉత్పత్తి కావడం లేదు. అందువల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల చిత్తూరులో టమాటా హైదరాబాద్ అంతరాయం ఏర్పడి ధరలు బాగా పెరిగిన పరిస్థితి నేపథ్యం నెలకొన్నది.  ఏ విధంగా చూసినా కూరగాయల అవసరం బాగా పెరిగింది. ఇదే పరిస్థితి పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో, మండలాల్లో కూడా ఉన్నది.  మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇందుకు కారణం కాయగూరల సరఫరా డిమాండ్ మధ్య ఉన్న  తేడాలు. 

లాభాలు అనేకం

ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో యాసంగి వరితో  పోలిస్తే కూరగాయల సాగుతో అనేక లాభాలున్నాయి. మొదటిది వరి సాగులో పెట్టిన  పెట్టుబడి తిరిగి రావాలంటే పెట్టుబడి పెట్టిన తర్వాత కనీసం 120 నుంచి 150 రోజులు ఆగాలి. సాగుచేసిన పంట దిగుబడి వచ్చేది అప్పుడే.

Pidigam Nagaiah,

Editor, teluguraitu.com

అంటే పెట్టిన పెట్టుబడి తో సహా   లాభాలు రావాలంటే ఎక్కువ కాలం ఆగాలి. కానీ కూరగాయలు సాగు చేస్తే 45 రోజుల నుండి అన్ని కూరగాయలలో దిగుబడులు మొదలవుతాయి. దీనికితోడు ఎక్కువ పని దినాలు ఎక్కువ. ఒక వేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒక పంట దెబ్బతిన్న తక్కువ నష్టం జరుగుతుంది. వరి సాగు చేసేటప్పుడు ఒక కిలో  వడ్లు ఉత్పత్తి చేయడానికి మూడు వేల నుండి ఐదు వేల కిలోల లీటర్ల నీరు అవసరం. అదే నీటితో పది కిలోల టమాటా, వంగ, మిరప వంటి కూరగాయలు ఉత్పత్తి చేయవచ్చు. అంటే వరికి సరిపోయే నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంటలను రైతులు సాగు చేసుకోవచ్చు. ఎండాకాలంలో గతంలో ఉన్నట్టు నీటి ఎద్దడి ఉండదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల సాగునీటి లభ్యత బాగా పెరిగింది. భూగర్భ జలాలు సైతం పెరిగాయి. కాబట్టి వేసవిలో సైతం సాగునీటి కొరత ఉండే అవకాశం లేదు. అంటే ఏమాత్రం సాగునీటి అందుబాటు ఉన్న రైతులు భేషుగ్గా కూరగాయల సాగు చేపట్టవచ్చు.

వాతావరణ పరిస్థితులు  కూరగాయల సాగుకు అనుకూలం

అలాగే రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితులు సైతం కూరగాయల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలో 46% ఎర్ర భూమి ఉన్నది. ఈ  భూములలో  అన్ని రకాల కూరగాయలు సాగు చేసుకోవచ్చు. అలాగే రసాయనాల అవశేషాలు లేని సేంద్రియ కూరగాయల సాగుకు అవకాశాలున్నాయి.  వరి వంటి పంటలలో సేంద్రియ సాగు ఏ మాత్రం అవకాశం లేదు.

దశకాలుగా ఓకే  భూమిలో వరి పంటను అదేపనిగా సాగు చేయడం వల్ల భూములు నిస్సారం అయ్యాయి. కూరగాయల సాగు వల్ల పంటల వైవిధ్యం పెరిగి భూములు బాగుపడతాయి. చీడపీడల సమస్య తగ్గుతుంది. ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయితే విలువల  జోడింపుకు ఎక్కువ అవకాశం ఉన్నవి పండ్లు, కూరగాయలు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగును భారీగా ప్రోత్సహిస్తుంది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం రాష్ట్రంలో పండ్లు, కూరగాయల సాగును భారీగా ప్రోత్సహిస్తుంది. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు అవసరమైన బిందు, తుంపర సేద్యం సదుపాయం,  పరికరాలను 80 శాతం నుంచి 100 శాతం సబ్సిడీతో అందిస్తుంది.

ఇప్పటికే రాష్ట్రంలో ఆయిల్ ఆయిల్  సాగుకున్న అనుకూల వాతావరణం నేపథ్యంలో వచ్చే ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఎకరాల్లో  తోట పంటలను పండించేందుకు ప్రభుత్వం మొక్కలు, నాటేందుకు, పెంచుకునేందుకు సబ్సిడీలు అలాగే నూనె తీసేందుకు అవ సరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. హైదరాబాద్ నగరం చుట్టూ 150 కిలోమీటర్ల పరిధిలో కాయగూరలు సాగు చేస్తున్న రైతులు అర్థం కావాలి. తాజా కూరగాయలు మార్కెట్ కు  వేసి ఎక్కువ ధరలు పొందే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow copy.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.