closeup photo of sproutPhoto by PhotoMIX Company on <a href="https://www.pexels.com/photo/closeup-photo-of-sprout-1002703/" rel="nofollow">Pexels.com</a>

పెట్టిన విత్తనాలలో ఎన్ని మొలకెత్తితే అంత శాతంగా నిర్ధారించుకోవాలి. దీన్ని రెండు విడతలుగా చేపట్టొచ్చు. ఒకటి నారు మడుల ద్వారా, రెండోది ప్లగ్ ట్రేల ద్వారా ముఖ్యంగా వంగ, మిరప, టమాటలో నారు. గా ఉంటుంది. దీంతో మొక్కలు ఎక్కువగా చనిపోతాయి. ఇది నీటి ద్వారా ఇతర నారు మొక్కలకు కూడా సోకి అన్ని పెంచడానికి నాలుగు మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు ఉన్న నారుమడులు 8 నుంచి 10 కావాలి. వీటిని భూమిపై నుంచి 15 సెం.మీ. ఎత్తులో ఉండేలా తయారు చేయాలి. దీంతో అధికంగా ఉండే నీరు నారులో నిల్వకుండా ఎప్పటికప్పుడు బయటకెళ్తుంది. తెగుళ్ల భయం ఉండదు. విత్తన మోతాదు రకాలను, హైబ్రీడ్లకు వేర్వేరుగా ఉంటుంది. నారుమడిలో విత్తే ముందు విత్తన శుద్ధి చేస్తే తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవచ్చు. పొలంలో నిర్దేశించిన సంఖ్యలో మొక్కలు ఉండి. దిగుబడులు పెరుగుతాయి.

Author: Pidigam Nagaiah, Senior Reporter and Editor

మిరప :

తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 3గ్రాముల కాస్టాన్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైసోడియం అరోపాస్పేట్లో విత్తనశుద్ధి చేయాలి. అలాగే సెంటు నారుమడిలో 80 గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు, 3గ్రాముల కాఫర్ అక్సీక్లోరైడ్ని లీటరు నీటిలో కలిపి నారుమడిలో విత్తనం నాటిన 9 నుంచి 13వ రోజులో తడపాలి..

టమాట:

Tomato seedlings
Tomato seedling in nursery

రసం పీల్చే పురుగు నుంచి కాపాడుకునేందుకు 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రీడ్, తెగుళ్ల నివారణకు 3 గ్రాముల థైరమ్ లేదా 3 గ్రా.మెటలాక్సిల్, ఆ తర్వాత 4గ్రాముల ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేయాలి. విత్తే ముందు లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ పా చొప్పున కలిపి నారుమళ్లు శుద్ధి చేస్తే నారుకుళ్ళు ఆశించదు.

వంగ: 

ఎత్తైన నారుమళ్లలో పెంపకానికి విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిలో 30 నిమిషాలపాటు నానబెట్టి నీడలో ఆరపెట్టాలి. ఆతర్వాత ధైరమ్ లేదా మాంకోజెబ్ ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేయ నీటిలో రెండు మూడుసార్లు నారును తడపాలి.

క్యాబేజీ:

కిలో విత్తనానికి 3 గ్రాముల థైరము వాడాలి. లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్లో నేలను తడపాలి. దాంతో నారుకుళ్లు తెగులు అదుపులో ఉంటుంది. లీటరు నీటిలో 2.5 మి. లీ మలాథియాన్కలిపి పిచికారీ చేస్తే ఆకు తినే పురుగు నుంచి రక్షణ ఉంటుంది.

ఉల్లిగడ్డ:

కాప్టాన్ లేదా థైరమ్తో విత్తనశుద్ధి చేయాలి. నారుమడిలో విత్తనాన్ని పల్చగా వరుసలలో నాటాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ తో నారుకుళ్లు, కార్బోప్యూరాన్ గుళికలతో రసం పీల్చే పురుగులను నివారించొచ్చు.

ప్లగ్ ట్రేలలో నారు పెంపకం:

కూరగాయల్లో నారు పెంపకానికి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించొచ్చు. హైబ్రిడ్ కూరగాయల విత్తనాలధర చాలా ఎక్కువ. ఒక్క గ్రాము విత్తనం ధర రూ.35 నుంచి రూ.70 వరకు ఉంటం సంప్రదాయ పద్ధతిలో కూరగాయల నారు.చేపట్టినప్పుడు నారుకుళ్లు, మృత్తికా సమస్యలతో నారు చనిపోవడం, ఎదుగుదల లేకపోవడంతో నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం)అందుబాటులోకి వచ్చిన ‘ప్లగ్ ట్రే పరిజ్ఞానంతో ప్రయోజనాలు అనేకం. ప్లగ్ ట్రేలో ముందుగా కోకోపీట్ (కొబ్బరి పీచు బాగా చిలికినది). నింపాలి. ఆతర్వాత ప్లగ్ ట్రేలో మధ్యలో వేలుతో చిన్నగుంట చేయాలి. ఒకనాలి. ఆ తర్వాత కొబ్బరి పీచుతో కప్పాలి. కొబ్బరి పీచు 300 నుంచి 400 శాతం నీటిని నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. కనుక వెంటనే విత్తనాలకు నీరందించాల్సిన అవసరం లేదు. పంటలను బట్టి 10 ట్రేలను ఒక దాని పై మరొకటి పెట్టొచ్చు. అయితే…ట్రేలలో నింపేందుకు వాడే కోకోపీట్ని వేప చెక్క లేదా విత్తన శుద్ధి శిలీందనాశనములతో శుద్ధి చేయాలి. ఒక్కో ట్రే నింపడానికి కిలో నుంచి 1200 గ్రాముల కోకోపీట్ అవసరం ఉంటుంది. విత్తనం నాటిన ట్రేలను 3నుంచి 6 రోజులపాటు చికట్లో ఉంచాలి. అప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow copy.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.