‘లిల్లీ’ని ‘నేల సంపంగి’ అని కూడా అంటారు. ఈ పూలను అలంకరణ కోసం వాడుతారు. డబుల్ రకాలను ‘కట్’ ఫ్లవర్గా వాడుతారు, సుగంధ ద్రవ్యాలను కూడా ఈ పూల నుంచి తీస్తారు. అయితే దీనికి ప్రత్యేక రకాలు వాడాలి.
Lilly flower
వాతావరణం
సమ శీతోష్ణ ప్రాంతం సాగుకు అనువైన పంట. బలమైన మొక్కల పెరుగుదలకు సూర్యరశ్మి పుష్కలంగా ఉం డాలి. 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాలి.
Pidigam Nagaiah, Editor, teluguraitu.com
నాటే సమయం
రాష్ట్రంలో జూలై-ఆగస్టు నెలలు నాటేందుకు అనుకూలం. వాణిజ్య సాగుకు దుంపలు వాడాలి. 25-30 గ్రాము ల బరువున్న దుంపలను హెక్టారుకు 1,12,000 వాడాలి. 2.5 సెం.మీ లోతులో 45X20 సెం.మీ దూరంలో బోదెల అంచు లపై నాటాలి. ప్రధాన పంట నుంచి సేకరించిన దుంపలను 30. రోజుల లోపు నాటాలి. లీటర్ నీటిలో 5 గ్రాముల 5000 పీపీ యం గాఢత కలిగిన ద్రావణంలో దుంపలు ముంచి నాటితే దిగు బడులు పెరుగుతాయి.
నేలలు
ఒండ్రునేలలు సాగుకు అనుకూలం. మురుగు నీరు పోయే వసతి ఉన్న భూములు సాగుకు ఎన్నుకోవాలి. నేలలో ఉదజని సూచిక 6.5-7.5 మధ్య ఉండాలి.
ఎరువులు
ఎకరానికి పది టన్నుల బాగా చిలికిన పశువుల ఎరు వుతో పాటు 80 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ లను వేయాలి. నత్రజని ఎరువు అయితే ప్రధాన పొలం తయారీ అప్పుడు ఒకసారి దుంపలు నాటిన 60, 90 రోజుల తర్వాత మరో రెండు దఫాలుగా వేయాలి.
సస్యరక్షణ
తామర పురుగులు, పేనుబంక రసం పీల్చే పురుగులు నివారణకు లీటర్ నీటికి 1.5 మి.లీ. డైమిథోయేట్, 1.5 మి.లీ. షిప్రొవిల్ పిచికారీ చేయాలి. నులిపురుగుల నివారణకు మొక్కకు వేరు వ్యవస్థలో ఒక గ్రాము 3 జీ గుళికలు వేసి నీటి తడులి వ్వాలి. లేదా ఎకరానికి 8-10 కిలోల ప్యూరడాన్ గుళిక లు భూమిలో తడి ఉన్నప్పుడు వేయాలి. కాండం కుళ్లు పూ మొగ్గ కుళ్లు తెగులు నివార ణకు లీటర్ నీటిలో ఒక పిచికారీ చేయాలి.
సూక్ష్మధాతు పోషకాలు
జింకు, ఇనుము, బోరాన్ వాడితే పూల నాణ్యత పెరుగుతుంది. జింకు సల్ఫేట్ 0.5 శాతం ఐరన్ సల్ఫేట్ 0.2 శాతంతో కలిపి 0.1 శాతం బోరిక్ ఆమ్లం పైపాటుగా పూల మొక్కలపై పిచికారీ చేయాలి.
నీటి యాజమాన్యం
7-10 రోజుల మధ్య నీటి తడులివ్వాలి.
వృద్ధి నియంత్రకాలు
ఈ పంటలో పూల దిగుబడి, నాణ్యత పెం చడంలో వృద్ధి నియంత్రకాలది ప్రధాన పాత్ర, ప్రధానంగా దుంపలు నాటిన 40, 55, 60 రోజుల్లో 50 పీపీఎం జిబ్బరిలిక్ ఆమ్లంను పైపాటుగా పిచికారీ చేయాలి.